ఎల్‌బీనగర్ లో గిరిజన మహిళపై పోలీసుల దాడి.. సుమోటోగా తీసుకున్న తెలంగాణ హైకోర్టు
LB Nagar: ఘటనపై చీఫ్ జస్టిస్‌కు లేఖ రాసిన జడ్జి సూరేపల్లి నంద
ఎల్‌బీనగర్ లో గిరిజన మహిళపై పోలీసుల దాడి.. సుమోటోగా తీసుకున్న తెలంగాణ హైకోర్టు
LB Nagar: ఎల్బీనగర్ గిరిజన మహిళపై పోలీసుల దాడి ఘటన కేసును సుమోటోగా తీసుకుంది తెలంగాణ హైకోర్టు. ఘటనపై చీఫ్ జస్టిస్‌కు జడ్జి సూరేపల్లి నంద లేఖ రాశారు. ఆ లేఖను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. త్వరలో సీజే బెంచ్‌లో విచారణ జరపనుంది. ఆగస్టు 15న రాత్రి సమయంలో ఎల్బీనగర్ బస్టాప్‌లో ఆటో కోసం ఎదురుచూస్తున్న మహిళను పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసులు ప్రశ్నించారు. తన బిడ్డ పెళ్లి కోసం ఊరికి వెళ్లానని, అక్కడి నుంచే వస్తున్నానని మహిళ పోలీసులకు చెప్పింది. పెళ్లి కార్డు కూడా చూపించినప్పటికీ.. పోలీసులకు అనుమానం రావడంతో.. ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయంలో పోలీసులతో మహిళ గొడవ పడటంతో విచక్షణా రహితంగా దాడి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మహిళపై దాడి చేసిన పోలీసులందరిపైనా కేసు పెట్టి అరెస్ట్ చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట బాధితురాలి బంధువులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీరియస్ అయిన రాచకొండ సీపీ చౌహాన్.. హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.