CM Revanth Reddy: గత ఎన్నికల్లో కారు షెడ్డుకు పోయింది
CM Revanth Reddy: కేసీఆర్ ప్రభుత్వం కుప్పకూలింది
CM Revanth Reddy: గత ఎన్నికల్లో కారు షెడ్డుకు పోయింది
CM Revanth Reddy: గత ఎన్నికల్లో కారు షెడ్డుకు పోయిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కార్ఖానా నుంచి ఇక కారు వాపసు రాదన్నారు. గద్దర్‌ను అవమానించిన ఉసురు తగిలి..కేసీఆర్ ప్రభుత్వం కుప్పకూలిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా.. ప్రజలు నమ్మరని తెలిపారు. సాయన్నకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయలేదని చెప్పారు. కంటోన్మెంట్ ప్రజలు ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోరన్నారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలిపితేనే..ఇక్కడి సమస్యలు పరిష్కారమవుతాయని రేవంత్ అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కంటోన్మెంట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు.