CM Revanth Reddy: బీజేపీకి 4వందల సీట్లు వస్తే రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర జరుగుతుంది
CM Revanth Reddy: కేసీఆర్ పదేళ్లు పాలనలో వందేళ్ల విధ్వసం జరిగింది
CM Revanth Reddy: బీజేపీకి 4వందల సీట్లు వస్తే రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర జరుగుతుంది
CM Revanth Reddy: దేశంలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 4వందల సీట్లు వస్తే రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బలహీన వర్గాలకు దక్కాల్సిన అవకాశాలు, నిధులు రావని అన్నారు. రిజర్వేషన్లపై గొంతెత్తి ప్రశ్నించినందుకు తనపై పగబట్టి స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రే కేసు పెట్టారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల ప్రతినిధులు కాంగ్రెస్అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని కలిసి కులగణన చేయాలని కోరారని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ పదేళ్లు పాలనలో వందేళ్ల విధ్వసం జరిగిందని విమర్శించారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో జరిగే కాంగ్రెస్జనజాతర సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.