KTR: కేటీఆర్ సవాల్.. 57వేల కోట్ల రుణాలు నిరూపిస్తే రాజీనామా చేస్తా..

KTR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Update: 2026-03-18 08:55 GMT

KTR: కేటీఆర్ సవాల్.. 57వేల కోట్ల రుణాలు నిరూపిస్తే రాజీనామా చేస్తా..

KTR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్‌లో ఆయన కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగట్టారు. ముఖ్యంగా వడ్డీ లేని రుణాలు, మూసి ప్రక్షాళన మరియు ఏడిబి (ADB) రుణాలపై ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెప్తోందని మండిపడ్డారు.

రాజీనామా సవాల్:

"57వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్తున్నారు. ఆ రుణాలు ఇచ్చినట్టు నిరూపిస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తాను. అబద్ధాలు చెబుతున్న వారు రాజీనామాకు సిద్ధమా? సీతక్క కానీ, భట్టి కానీ దీనిపై సమాధానం చెప్పాలి" అని కేటీఆర్ సవాల్ విసిరారు. సభను తప్పుదోవ పట్టించినందుకు మంత్రిపై సభ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని స్పష్టం చేశారు.

మూసి ప్రాజెక్ట్.. అంతా లూటీయే!

మూసి ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున లూటీకి పాల్పడుతోందని కేటీఆర్ ఆరోపించారు.

DPR లేదు - రుణం లేదు: ఏడిబి నుంచి రుణం వచ్చిందని మంత్రి శ్రీధర్ బాబు అబద్ధం చెప్తున్నారని, అసలు డిపిఆర్ (DPR) ఇవ్వనందున రుణం ఇచ్చే ప్రసక్తే లేదని ఏడిబి స్పష్టం చేస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు.

రియల్ ఎస్టేట్ దందా: మూసి ప్రాజెక్ట్ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనని, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ నగర్ వాసులకు కూడా నోటీసులు ఇవ్వడం దారుణమని మండిపడ్డారు.

Meinhart నిషేధం: ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ అయిన మెయిన్ హార్ట్ (Meinhart) సంస్థను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిషేధించిందని, అలాంటి సంస్థకు ప్రాజెక్ట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

అధికారులకు హెచ్చరిక:

అధికారుల తీరుపై కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "కుక్క తోకను ఆడించాలి కానీ, తోక కుక్కను ఆడించినట్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే పదవి చీఫ్ సెక్రటరీ స్థాయి కంటే పెద్దది. అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు" అని హెచ్చరించారు.

గవర్నర్ ప్రసంగంపై విమర్శలు:

గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలే ఉన్నాయని, కనీసం సరైన సమాచారాన్ని కూడా గవర్నర్‌కు ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఆరు గ్యారంటీలకు డబ్బులు లేవు కానీ, మూసి ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని నిలదీశారు. రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లు కొడంగల్‌లో ఎఫ్.టి.ఎల్ (FTL) పరిధిలోనే ఉందని కేటీఆర్ ఈ సందర్భంగా ఆరోపించారు.

Tags:    

Similar News