ఐబొమ్మ రవి కస్టడీపై నేడు తీర్పు – మరో 7 రోజుల కోసం పోలీసుల పిటిషన్
నేడు ఐబొమ్మ రవి కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు తీర్పు మరో ఏడు రోజులు కస్టడీకీ కోరుతూ పోలీసుల పిటిషన్ ఇప్పటికే 5 రోజులు రవిని విచారించిన పోలీసులు మరో ఏడు రోజుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్
ఐబొమ్మ రవి కస్టడీపై నేడు తీర్పు – మరో 7 రోజుల కోసం పోలీసుల పిటిషన్
నేడు ఐబొమ్మ రవి కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. మరో ఏడు రోజులు కస్టడీకీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఐబొమ్మ పైరసీ కేసులో ఇప్పటికే 5 రోజులు రవిని సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. మరో ఏడు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. 5 రోజుల కస్టడీలో సినిమాలు ఎలా అప్లోడ్ చేశాడు..? ఇన్కమ్ సోర్స్ ఎలా ఉంది..? అనే అంశాలపై విచారించామన్నారు. ఈజీ మనీ ఉద్దేశ్యంతోనే టెక్నాలజీ ఉపయోగించి.. సినిమాలు పైరసీ చేసినట్టు గుర్తించామన్నారు. రవిని మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని.. మరో ఏడు రోసులు తమకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరనున్నారు.