Kadiyam Srihari: AICC నేతలు మా ఇంటికి వచ్చారు.. త్వరలోనే నా నిర్ణయాన్ని వెల్లడిస్తా
Kadiyam Srihari: ఆలోచించి నిర్ణయం చెబుతానని చెప్పాను
Kadiyam Srihari: AICC నేతలు మా ఇంటికి వచ్చారు.. త్వరలోనే నా నిర్ణయాన్ని వెల్లడిస్తా
Kadiyam Srihari: మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ సమావేశం అయ్యారు. కడియం శ్రీహరితో పాటు ఆయన కూతురు కావ్యను కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్ మున్షీ. ఈ సందర్భంగా కడియం శ్రీహరి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పారు దీపాదాస్. కడియంకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని దీపాదాస్ మున్షీ చెప్పారు.
ఇక కాంగ్రెస్‌లోకి ఎంట్రీపై కడియం శ్రీహరి స్పందించారు. ఏఐసీసీ నేతలు తమ ఇంటికి వచ్చారన్నారు కడియం. కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని కోరారని అన్నారు. తన నిర్ణయాన్ని త్వరలో ఆలోచించి చెబుతానని తెలిపినట్లు చెప్పారు కడియం శ్రీహరి.