IIFA Telangana: ఐఫా వేడుకలకు వరుసగా మూడుేళ్ల పాటు హైదరాబాద్ ఆతిథ్యం

తెలంగాణ ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA)తో ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

Update: 2025-12-11 07:07 GMT

IIFA Telangana: ఐఫా వేడుకలకు వరుసగా మూడుేళ్ల పాటు హైదరాబాద్ ఆతిథ్యం

తెలంగాణ ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA)తో ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 సందర్భంగా కుదిరిన ఈ భాగస్వామ్య ఒప్పందం ప్రకారం, 2026 నుంచి 2028 వరకు మూడు సంవత్సరాల పాటు ఐఫా అవార్డ్స్ ఉత్సవాలు హైదరాబాద్‌లో జరుగనున్నాయి.

దాంతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల అగ్రతారలు, సాంకేతిక నిపుణులు, సినీ ప్రముఖులు వరుసగా మూడు సంవత్సరాల పాటు భాగ్యనగరాన్ని సందర్శించనున్నారు.

హైదరాబాద్‌ను సాంకేతిక–సాంస్కృతిక రాజధానిగా ఎదిగించాలన్న సంకల్పం

ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 

“వరుసగా మూడు సంవత్సరాల పాటు ఐఫా ఉత్సవం నిర్వహించడం ద్వారా దక్షిణ భారతదేశ సాంస్కృతిక రాజధానిగా, సినిమా ఆధారిత పర్యాటకం మరియు క్రియేటివ్ ఎకానమీకి గ్లోబల్ హబ్‌గా తెలంగాణను నిలబెట్టడమే మా లక్ష్యం” అని తెలిపారు.

ప్రపంచ నగరాల తరహాలో ఇప్పుడు హైదరాబాద్‌లో ఐఫా

గత 25 ఏళ్లుగా ఐఫా ఒక గ్లోబల్ కల్చరల్ సూపర్ బ్రాండ్‌గా ఎదిగింది.

లండన్, న్యూయార్క్, ఆమ్‌స్టర్‌డామ్, సింగపూర్, అబుదాబి, మాడ్రిడ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత నగరాల్లో ఐఫా తన ప్రత్యేక గుర్తింపును సృష్టించింది.

ఇలాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు మొదటిసారి మూడు వరుస సంవత్సరాల పాటు హైదరాబాద్ వేదిక కావడం తెలంగాణకు, భాగ్యనగరానికి ఎంతో గర్వకారణం.

Tags:    

Similar News