కాలు విరిగిందని జీహెచ్ఎంసీపై యువకుడి ఫిర్యాదు

ఒక్క వ్యక్తి ఫిర్యాదులో జీహెచ్ఎంసీ అధికారుల నిద్రమత్తు వదలింది. వెంటనే రంగలోకి దిగి రోడ్డుపై గుంతలు పూడ్చరు. ఎడతెరిపి లేని వర్షాలకు హైదరాబాద్ లో రోడ్లు గుంతలు పడి దారుణంగా తయారైయ్యాయి. వర్షం పడిన సమయంలో రోడ్లుపై నల్లాను నుంచి వచ్చే నీరు నిలిచిపోవడంతో ఎక్కడ మ్యాన్‌హోల్స్ ఉన్నాయో తెలియని దుస్థితి.

Update: 2019-10-11 04:47 GMT

ఒక్క వ్యక్తి ఫిర్యాదులో జీహెచ్ఎంసీ అధికారుల నిద్రమత్తు వదలింది. వెంటనే రంగలోకి దిగి రోడ్డుపై గుంతలు పూడ్చరు. ఎడతెరిపి లేని వర్షాలకు హైదరాబాద్ లో రోడ్లు గుంతలు పడి దారుణంగా తయారైయ్యాయి. వర్షం పడిన సమయంలో రోడ్లుపై నల్లాను నుంచి వచ్చే నీరు నిలిచిపోవడంతో ఎక్కడ మ్యాన్‌హోల్స్ ఉన్నాయో తెలియని దుస్థితి. కాగా.. నగరంలోని పాతబస్తీకి చెందిన సయ్యద్ అజ్మత్ హుస్సేన్ జాఫ్రీ అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం బైక్ నడుపుతూ గుంతలో పడి కాలు కాలు విరిగింది.

ఆదివారం రాత్రి జాఫ్రీ నూర్‌ఖాన్‌ బజార్‌ నుంచి బాల్‌షెట్టి ఖేట్‌కు పయనమైయ్యాడు. రోడ్డపై ఉన్న గుంతలో ద్విచక్రవాహనం దిగబడింది. దీంతో జాఫ్రీ కిందపడ్డాడు. ఈ ఘటనలో అతని కాలు విరిగిపోయింది. . జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వలనే ప్రమాదం జరిగిందని డబీర్‌పుర పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తాను ప్రమాదానికి గురికావడాని జోనల్ కమిషనర్ బాధ్యత వహించాలని, వారిపై చర్యలు తీసుకోవాలని జాఫ్రీ ఫిర్యదులో పేర్కొన్నారు. ముందే గుంతలు పూడ్చితే ఉండేది కాదు కదా అని అందరూ అనుకుంటున్నారు.

Tags:    

Similar News