Hyderabad Police: ఆన్‌లైన్‌లో కోవిడ్ మెడిసిన్స్..అలెర్ట్ అయిన పోలీసులు
Hyderabad Police: ఆన్ లైన్లో కోవిడ్ చికిత్స పేరుతో అమ్ముతోన్నమందులను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకండి.
Fake Corona Medicine:(File Image)
Hyderabad Police: గతంలో ఎన్నడూ లేని విధంగా కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వ్యాధి కంటే భయం చాలా ప్రమాదకరమనే మాట కరోనా విషయంలో అక్షర సత్యంగా నిలుస్తోంది. ఎక్కడో ఏదో జరిగిపోతోందన్న గందరగోళం ప్రజల్లో నెలకొంది. ఈ క్రమంలోనే ఎవరు ఏది చెప్పినా వెంటనే ఆచరిస్తున్నారు. ఇక మనుషుల భయాన్ని వాడుకుని వ్యాపారం చేసే వారు కూడా మన సమాజంలో ఉన్నారు. దీనిపై హైదరాబాద్ పోలీసులు అవేర్ నెస్ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ క్రమంలోనే ఆన్‌లైన్ వేదికగా కరోనా చికిత్స కోసం అంటూ కొన్ని మందులు బాగా హల్చల్ చేస్తున్నాయి. భయంతో ఉన్న ప్రజలు ముందూ వెనకా చూడకుండా ఆన్‌లైన్‌లో మందులను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రజలను అలర్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. అనధికారిక వెబ్‌సైట్లు, వ్యక్తుల నుంచి కోవిడ్ చికిత్స పేరుతో అమ్ముతోన్నమందులను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకండి. ఇవి ప్రాణాల మీదకు తీసుకొచ్చే ప్రమాదం ఉంది. అంటూ ట్విట్టర్ వేదికగా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.