Hyderabad: గాంధీ ఆస్పత్రి అంబులెన్స్ డ్రైవర్‌కు కరోనా

Update: 2020-04-29 04:51 GMT

కరోనా వైరస్‌ ఎవర్నీ వదలడం లేదు. అందరిని వెంటాడుతూ చంపేస్తుంది. భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో రోజురోజుకూ ఈ కేసుల తీవ్రత పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకం రేపింది. అక్కడ అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేస్తున్న సూదగాని వినోద్‌కి కరోనా వ్యాధి సోకినట్లు అధికారులు ధృవీకరించారు. అత్తగారిల్లు బయ్యారం కావడంతో వినోద్ తన భార్య, పిల్లలతో అక్కడే ఉన్నాడు. అయితే కరోనా పాజిటివ్ అని తేలడంతో భార్య, పిల్లలతో పాటు అత్తామామను అధికారులు బయ్యారంలో హౌజ్ క్వారెంటైన్ చేశారు.

Tags:    

Similar News