నిందితుల శరీరాలల్లో అసలు బుల్లెట్లే లేవు

దిశ హత్యోదంతం దేశ ప్రజల మనసుల్ని కలిచివేసిన ఘటన. పరిచయం లేని దిశ కోసం దేశమంతా ఒక్కటైన ఘటన.

Update: 2019-12-11 09:34 GMT

దిశ హత్యోదంతం దేశ ప్రజల మనసుల్ని కలిచివేసిన ఘటన. పరిచయం లేని దిశ కోసం దేశమంతా ఒక్కటైన ఘటన. రక్తసంబంధం లేకున్నా ఎవరూ పిలవకున్నా ప్రజలంతా ఏకమై న్యాయం కోసం నినదించిన ఘటన. దిశను అత్యంత కిరాకతకంగా, అత్యంత అమానవీయంగా చంపిన నలుగురు నిందితులను సైబరాబాద్‌ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. అయితే ఎన్‌కౌంటర్‌పై జరుగుతున్న దర్యాప్తులో మాత్రం పోలీసులకు కొత్త చిక్కులు వస్తున్నాయి. 'దిశ' ఘటనపై పోలీసులు ఈ నెల 6న చటాన్‌పల్లిలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులను పారిపోయేందుకు ప్రయత్నించి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.

ఎన్‌కౌంటర్ సందర్భంగా పోలీసులు కాల్చిన బుల్లెట్లలో ఆరిఫ్ శరీరంలోకి నాలుగు, శివ, చెన్నకేశవులు శరీరంలోకి మూడు, నవీన్ బాడీలోకి ఓ బుల్లెట్ దూసుకుపోయాయి. అయితే పోస్టుమార్టం చేసిన సమయంలో అసలు బాడీలో ఒక్క బుల్లెట్ కూడా లేదని తెలుస్తుంది. బుల్లెట్లన్నీ నిందితుల శరీరాలను చీల్చుకుంటూ పోయాయని పోలీసులు భావిస్తున్నారు. దీని మీద స్పందించాడనికి వైద్యులు నిరాకరిస్తున్నారు. మృతుల శరీరాల్లో బుల్లెట్లు ఉంటే వాటి నంబర్ ఆధారంగా ఎవరు కాల్చారో కనిపెట్టే అవకాశముంటుందని, అయితే బుల్లెట్లు బయటకి చొచ్చుకుని రావడంతో నిర్ధారించడం తలనొప్పిగా మారింది.

Tags:    

Similar News