Huzurnagar: ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలి

మాలమహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీలకు 100 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ కు వినతిపత్రం అందించడం జరిగింది.

Update: 2020-02-12 13:54 GMT

హుజూర్నగర్: మాలమహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీలకు 100 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ కు వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా మాలమహానాడు పట్టణ అధ్యక్షుడు దగ్గుబాటి బాబురావు మాట్లాడుతూ హుజూర్నగర్ లోని తిలక్ నగర్, గోవిందపురం, హరిజనవాడ మిగతా అన్ని ప్రాంతాలలో నివసిస్తున్న ఎస్సీ, ఎస్టీలకు గతఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినట్లుగా 100 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు.

ఇప్పటి వరకు ఆ పథకం అమలు కాక పోగా విద్యుత్ శాఖ వారు పేద ఎస్సీ, ఎస్టీలను ముక్కు పిండి మరీ బిల్లులు వసూలు చేస్తున్నారని వెంటనే ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు ప్రకటించినట్లుగా 100 యూనిట్ల లోపు విద్యుత్ వాడకాన్ని పూర్తిగా ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు.


Tags:    

Similar News