Telangana: అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త...చితకబాదిన భార్య

Telangana: యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజు అనే కేబుల్‌ ఆపరేటర్

Update: 2021-03-04 01:47 GMT

Representational Image

Telangana: అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త తాట తీసింది ఓ భార్య. తనను మోసిన చేసిన భర్తను, తన భర్తను లొంగదీసుకున్న యువతిని చితకబాదింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. నగరంలోని గాజులరాజాం బస్తీలో కేబుల్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న రాజు అనే వ్యక్తి అదే ఏరియాలో ఉంటున్న యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అనుమానం వచ్చిన భార్య భర్తను నిలదీసింది. అదంతా అబద్ధమంటూ బుకాయిస్తూ వచ్చాడు.

అయితే ఈ రోజు యువతి ఇంటికి వెళ్లిన భర్తను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకుంది భార్య. తలుపులకు గడియపెట్టి, బంధువులను రప్పించి, చితకబాదింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని వారిని స్టేషన్‌కు తరలించారు. 

Tags:    

Similar News