ఈ పోలీసుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
-మానవత్వం చాటుకున్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ -ఓ అనాథను చూసి చలించిపోయిన సత్యనారాయణ -పదేళ్లుగా సామాజిక సేవ చేస్తున్నా కానిస్టేబుల్
ఆత్మీయ బంధాలు ప్రేమసంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. కుటుబంబ సభ్యుల ఆదరణకు నోచుకోక ఎందరో అనాథలుగా మిగులుతున్నారు. వారికి పట్టెడన్నం పెట్టేవారు లేక జీవచ్ఛవాలుగా మారుతున్నారు. అయితే తెలంగాణకు చెందిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం అందరిలా రోజు వృత్తి ధర్మాన్ని నిర్మిహిస్తూనే సామాజిక సేవలోను ముందున్నాడు.
కరీంనగర్‌లో సత్యనారాయణ అనే ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఆయన విధులు నిర్వహిస్తున్న ప్రాంతంలో కన్పించిన ఓ అనాథను చూసి చలించిపోయాడు. అతనికి కటింగ్ చేయించి స్వయంగా తనే స్నానం చేయించి కొత్త బట్టలు వేయించాడు. గత పదేళ్లుగా సామాజిక సేవ చేస్తున్నానని.. ప్రతి ఒక్కరు తమకు ఉన్నంతలో లేని వారికి సాయం చేయాలని సూచించారు ట్రాఫిక్ కానిస్టేబుల్ సత్యనారాయణ.