Pranay Murder Case: ఎలాంటి క్లూ లేని కేసును పోలీసులు ఎలా చేధించారు?

Pranay Murder Case: పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ఏ 2 గా ఉన్న సుభాశ్ శర్మకు నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు ఉరిశిక్ష విధించింది.

Update: 2025-03-10 08:08 GMT

Pranay Murder Case: ఎలాంటి క్లూ లేని కేసును పోలీసులు ఎలా చేధించారు?

Pranay Murder Case: పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ఏ 2 గా ఉన్న సుభాశ్ శర్మకు నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో మిగిలిన దోషులు ఆరుగురికి కోర్టు జీవిత ఖైదు విధించింది. ఎలాంటి చిన్న క్లూ లేని కేసులో నాలుగు రోజుల్లో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. దోషులకు శిక్షపడేందుకు వీలుగా పోలీసులు ఆధారాలను సేకరించారు. ఈ ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. అంతేకాదు ఈ కేసుతో సంబంధం ఉన్న వారికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రణయ్ హత్య కేసు నిందితులు ఎలా పట్టుకున్నారంటే?

పెరుమాళ్ల ప్రణయ్, అమృత 2018 జనవరి 31న హైదరాబాద్ ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. ప్రణయ్, అమృతలవి వేర్వేరు సామాజిక వర్గాలు. ఈ పెళ్లి అమృత తండ్రి అమృతరావుకు నచ్చలేదు. దీంతో ప్రణయ్ ను హత్య చేయాలని ఆయన ప్లాన్ చేశారని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్‌ను మిర్యాలగూడలో సుభాశ్ శర్మ హత్య చేశారు.ఈ హత్యకు సంబంధించిన ఆసుపత్రి వద్ద ఉన్న సీసీటీవీ పుటేజీలో గుర్తించారు. ఈ సీసీటీవీ పుటేజీ పోలీసులకు ఆధారాలు దొరికేలా చేసింది.ఈ కేసులో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి అందుకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. ఈ ఆధారాలతోనే కోర్టు దోషులకు శిక్ష విధించింది. ప్రణయ్ ను హత్య చేసిన తర్వాత సుభాశ్ శర్మను అస్గర్ అలీ స్కూటీపై నాగార్జునసాగర్ నుంచి నల్గొండకు అక్కడి నుంచి బెంగుళూరుకు వెళ్లాడు. బెంగుళూరు నుంచి సుభాశ్ శర్మ రైలులో బీహార్ వెళ్తున్న సమయంలో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అస్గర్ అలీ, అబ్దుల్ బారిని కూడా పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీసులు మారుతీరావు నుంచి సేకరించారు. ఆయనను కూడా అరెస్ట్ చేశారు.

1600 పేజీల చార్జీషీట్ వెనుక

ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి 2019 జూన్ 12న పోలీసులు 1600 పేజీలతో చార్జీషీట్ దాఖలు చేశారు. అయితే చార్జీషీట్ దాఖలు చేయడానికి ముందే పదిసార్లు దాన్ని మార్పులు చేశారు. ఈ కేసుకు సంబంధించి దోషులు తప్పించుకోకుండా ఉండేలా చార్జీషీటులో జాగ్రత్తలు తీసుకున్నారు. కోర్టులో దాఖలు చేయడానికి ముందే చార్జీషీటులో పదిసార్లు మార్పులు చేర్పులు చేశారు. ఆ తర్వాతే కోర్టుకు సమర్పించారు.

హత్యకు ప్లాన్ ఎలా ఇలా...

తన కూతురు అమృత కులాంతర వివాహం చేసుకోవడంతో మారుతీరావు తట్టుకోలేకపోయారు. ప్రణయ్ ను హత్య చేయాలని ప్లాన్ చేశారు. ఓ భూ వివాదంలో 2011లో పరిచయమైన కరీం సహాయం ఆయన తీసుకున్నారు. గుజరాత్ మాజీ హోంశాఖ మంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అస్గర్ అలీ, ఇదే కేసులో ఏ11 గా ఉన్న బారీతో కరీం మాట్లాడారు. ఈ హత్యకు సంబంధించిన ప్లాన్ ను గురించి వివరించారు. అయితే దీనికి సంబంధించిన డీల్ మాట్లాడేందుకు గాను అస్గర్, బారీ మూడు సిమ్ కార్డులు కొనుగోలు చేశారు. ఈ సిమ్ ద్వారానే మాట్లాడేవారు. 2018 జూలైలో అస్గర్, బారి మిర్యాలగూడలో అమృతరావును కలిశారు. కారులోనే ఈ హత్యకు సంబంధించి డీల్ కుదిరిందని అప్పట్లో ఈ కేసుకు సంబంధించిన వివరాలను అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ ప్రకటించారు. సుమారు రెండున్నర కోట్లు ఇవ్వాలని అస్గర్ బృందం మారుతీరావును కోరారు. అయితే కోటి రూపాయాలకు డీల్ కుదిరింది. అయితే రూ. 50 లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలని కోరితే రూ. 15 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. 2018 జూలై 9, 10 తేదీల్లో అస్గర్ కు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద ఈ డబ్బును కరీం అందించినట్టు పోలీసులు వివరించారు.

కిడ్నాప్ ప్లాన్ ఫెయిల్..

2018 ఆగస్టు మొదటి వారం నుంచి ప్రణయ్ హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ సెప్టెంబర్ 14 ప్రణయ్ ను హత్య చేశారు. ప్రణయ్ ఆయన భార్య అమృత, ప్రణయ్ సోదరుడితో కలిసి మిర్యాలగూడ బ్యూటీపార్లర్ కు వెళ్లారు. అయితే ప్రణయ్ , ఆయన సోదరుడు ఒకే రకంగా ఉన్నారు. దీంతో ప్రణయ్ ఎవరో నిందితులు తేల్చుకోలేకపోయారు. బ్యూటీపార్లర్ లో ప్రణయ్ హత్య ప్లాన్ ఫెయిల్ అయింది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో అమృత, ప్రణయ్ కిడ్నాప్ చేసి హత్య చేయాలనుకున్నారు. ఇందు కోసం సుఫారీ గ్యాంగ్ ను అస్గర్ అలీ మాట్లాడారు. అయితే ఈ గ్యాంగ్ మద్యం మత్తులో ఉండడంతో వేరేవారిని ఇందుకోసం వినియోగించుకోవాలని సుభాశ్ శర్మను అస్గర్ అలీ సంప్రదించారు.

పోలీస్ బందోబస్తు

ఈ కేసుతో సంబంధం ఉన్నవారికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రణయ్ ఇంటి వద్ద పోలీసులను రక్షణగా ఉంచారు. అంతేకాదు సీసీటీవీలు ఏర్పాటు చేయించారు. మరో వైపు ఈ కేసును వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నర్సింహకు భద్రతను కల్పించారు పోలీసులు. కేసుకు సంబంధించిన ఆధారాలను పకడ్బందీగా పోలీసులు సేకరించారు. ప్రణయ్ హత్య సమయంలో నిందితుడు సుభాశ్ శర్మ ఎలా నడిచాడనే విషయానికి సంబంధించి గేటు ప్యాట్రన్ ను కూడా పోలీసులు ల్యాబ్ కు పంపారు. ఇలా ప్రతి ఆధారాన్ని సేకరించి కోర్టుకు అందించారు.

Tags:    

Similar News