Temperature: బాబోయ్ ఎండలు మండిపోతున్నాయ్.. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు
Temperature: 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
Temperature: బాబోయ్ ఎండలు మండిపోతున్నాయ్.. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు
Temperature: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దక్షిణ కోస్తా జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదువున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొండాపురంలో 46.4 అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. వచ్చే రెండు రోజులు ఎండలు మరింత తీవ్రమవుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఎండవేడి తగ్గడం లేదు.
సూర్యప్రతాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రకాశం జిల్లాలో వడదెబ్బకు నలుగురు మృతి చెందారు. వడదెబ్బల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.