సమ్మె కొనసాగింపుపై పునరాలోచన చేస్తాం : జేఏసీ

Update: 2019-11-13 03:57 GMT

ఆర్టీసీ సమ్మె 40 వ రోజుకు చేరుకుంది. అరకొర బస్సులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై ఇవాళ హైకోర్టు విచారించనుంది. నిన్న సమ్మె కేసు విచారణ జరిపిన న్యాయస్థానం సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తాం అని తెలిపింది. దీనిపై ప్రభుత్వ నిర్ణయం తెలుపాలని కోరింది. కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వం కోర్టుకు తన అభిప్రాయం తెలియజేసే అవకాశం వుంది. రూట్ల ప్రైవేటీకరణపై న్యాయస్థానం విచారించనుంది.

ఆర్టీసీ సమస్యలు పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తే, సమ్మె కొనసాగింపుపై పునరాలోచన చేస్తామని జేఏసీ తెలిపింది. ఒకవేళ కమిటీ ఏర్పాటు అయితే, సమ్మె కొనసాగింపుపై 24 గంటల్లో తమ అభిప్రాయం తెలియజేస్తామని తెలిపింది. మరోవైపు ఆర్టీసీ సమ్మె, హై కోర్టు విచారణపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే ఈ రోజు హై కోర్టులో ప్రభుత్వం తరపున వాదనలను ఖరారు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రభుత్వం చర్యలను హై కోర్టు సమర్థించేలా బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.


Tags:    

Similar News