రైతు బంధు పథకంపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

రైతు బంధు పథకంపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రైతు బంధు అమలు తీరు సరిగా లేదంటూ రిటైర్డ్ డీఎస్పీ రాఘవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

Update: 2019-08-28 09:27 GMT

రైతు బంధు పథకంపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రైతు బంధు అమలు తీరు సరిగా లేదంటూ రిటైర్డ్ డీఎస్పీ రాఘవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనకు తొలి విడత నిధులు మంజూరు చేసిన అధికారులు రెండు, మూడో విడత నిధులు ఇవ్వలేదంటూ కోర్టుకు తెలియజేశారు. చట్టబద్ధంగా తనకు రావాల్సిన నిధులు ఇప్పించాలంటూ పిటిషనర్ కోర్టును కోరారు. దీనిపై విచారించిన న్యాయస్ధానం రెవిన్యూ, వ్యవసాయ శాఖలతో పాటు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలంటూ ఆదేశించింది.   

Tags:    

Similar News