హైకోర్టులో మేడిగడ్డ బ్యారేజ్‌పై విచారణ వాయిదా

High Court: మేడిగడ్డ కుంగుబాటుపై సీబీఐ విచారణ జరిపించాలని పిల్

Update: 2024-02-02 09:03 GMT

హైకోర్టులో మేడిగడ్డ బ్యారేజ్‌పై విచారణ వాయిదా

High Court: తెలంగాణ హైకోర్టులో మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగుబాటుపై దాఖలైన పిల్‌‌ నేడు విచారణకు వచ్చింది. సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు నిరంజన్ హైకోర్టులో పిల్ వేశారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై వివరాలు సమర్పించాల్సిందిగా.... గతంలోనే తెలంగాణ సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది.

కొంత సమయం కావాలని హైకోర్టును అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోరగా... 2 వారాల పాటు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ సమయం ఇచ్చింది. ఇదే సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు.... తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.

Tags:    

Similar News