Bhadradri Kothagudem: బంగారం షాపులో భారీ చోరీ..గ్యాస్ కట్టర్ల సాయంతో లాక్ పగలగొట్టిన దుండగులు
Bhadradri Kothagudem: యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
Bhadradri Kothagudem: బంగారం షాపులో భారీ చోరీ..గ్యాస్ కట్టర్ల సాయంతో లాక్ పగలగొట్టిన దుండగులు
Bhadradri Kothagudem: బంగారం షాపులో భారీ చోరీ జరిగింది. సిమెంటు గోడకు రంధ్రం చేసి గ్యాస్ కట్టర్ల సాయంతో లాకర్ పగలగొట్టిన దుండగులు బంగారు, వెండి నగలు దోచుకెళ్లారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మెయిన్ రోడ్ లోని భవాని జ్యువలరీ షాపులో ఈ చోరీ జరగగా... షాపు యజమాని ఫిర్యాదు మేరకు సిసి కెమెరా ఫుటేజ్ తో క్లూస్ టీం ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. షాపు పక్కనే అద్దెకు ఉంటున్న ఇద్దరు వ్యక్తులతో పాటు మరొక వ్యక్తి చోరీకి పాల్పడినట్లు కొత్తగూడెం రూరల్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ రమాకాంత్ తెలిపారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.