ఇంటి గోడ కూలి చిన్నారి మృతి

Update: 2020-10-18 04:43 GMT

హైదరాబాద్‌లో నగరంలో మరోసారి వర్షం రావడంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో ఇటు జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. నగరంలోని పలు చోట్ల ఇప్పటికే వరద ముంపునకు గురయ్యాయి. అదే విధంగా నిన్న రాత్రి నగరంలో కురిసిన భారీ వర్షానికి నగరం తడిసిముద్దయింది. నగరంలో వరద భీబత్సవావనికి ఎంతో మంది కొట్టుకొపోయారు. అయితే వారిలో కొంత మంది సురక్షితంగా బయట పడ్డప్పటికీ మరికొంత మంది మాత్రం విగతజీవులయ్యారు. ఈ క్రమంలోనే మరో ఆరేళ్ల బాలిక కూడా విగతజీవిగా మారింది. ఈ విషాదకర సంఘటన మంగళ టర్కీ పేట్ లో చోటు చేసుకుంది.

ఈ సంఘటనకు సంబంధించిన పూర్తివివరాల్లోకెళితే మంగళటర్కీ పేట్ లో నిన్న కురిసిన భారీ వర్షానికి ఆరేండ్ల చిన్నారి మృత్యువాత పడింది. భారీ వర్షాలకు ఇంటి గోడ కూలడంతో చిన్నారి జుబేదా మరణించింది. ఈ సంఘటనతో ఆ కుటుంబంలో విషాదఛాయాలు నెలకొన్నాయి. కళ్ల ముందే కన్న బిడ్డ మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక ఈ విషయం తెలియగానే అక్కడికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలియగానే కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్ తో పాటు నగర డిప్యూటీ మేయర్ బాబా ఫాసిఉద్దీన్ సంఘటన స్థలానికి చేరుకొని మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించరు.

హైదరాబాద్ లో నిన్న అనేక ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. మొన్నటి అతి భారీ వర్షంనుంచి ఇంకా నగరం కోలుకోనేలేదు. అనేక ప్రాంతాలు ఇంకా నీట మునిగి ఉండగానే మళ్లీ వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు.. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, కూకట్ పల్లి, ప్రగతి నగర్, మలక్ పేట ఎల్బీ నగర్, దిల్ షుక్ నగర్, ఫిలింనగర్, హయత్ నగర్, చైతన్యపురి, సరూర్ నగర్ లలో గంట నుంచి విడవకుండా వర్షం తడాఖా చూపిస్తోంది.

Tags:    

Similar News