వరుణదేవుడి ఆగ్రహంతో యాదాద్రి విలవిల.. ఆలయంలోకి నీరు.. దెబ్బతిన్న రోడ్లు.. కూరుకుపోయిన బస్సులు

Yadadri: రోడ్డుకు బీటలు, యుద్ధప్రాతి పదికన మరమ్మతు పనులు...

Update: 2022-05-04 07:15 GMT

వరుణదేవుడి ఆగ్రహంతో యాదాద్రి విలవిల.. ఆలయంలోకి నీరు.. దెబ్బతిన్న రోడ్లు.. కూరుకుపోయిన బస్సులు

Yadadri: వరుణదేవుడి ఆగ్రహానికి యాదాద్రి విలవిల్లాడింది. ఆలయపరిసరాల్లో గందరగోల పరిస్థితి నెలకొంది. ఘాట్ రోడ్డు పలుచోట్ల కుంగి పోయింది. యాదాద్రీశుని ఆలయంలోకి వర్షపు నీరు చేరుకున్నాయి. ఆలయం ముందుభాగాన వేసిన చలువ పందిళ్లు కూలిపోయాయి. రోడ్డు దెబ్బతిని కుంగిపోయింది. బస్ బే వద్ద వేసిన చలువ పందిళ్లు, టెంట్లు గాలికి ఎగిరిపోయాయి. ఆలయ పరిసరాల్లో రెండు బస్సులు బురదలో కూరుకుపోయాయి. యాదాద్రిగుట్టపైకెళ్లే మూడో ఘాట్ రోడ్డు పలుచోట్ల కుంగిపోయింది.

దీంతో ఘాట్ రోడ్డు గుండా వచ్చే వాహనాలను ఆపేశారు. మూడో ఘాట్ రోడ్డుపై బ్రిడ్జి కోతకు గురికావడంతో కళ్యాణకట్ట, విష్ణు పుష్కరిణి మీదుగా కొండపైకెళ్లే వాహనాలకు ఆటంకం కలిగింది. వర్షం ఆగిన వైటీడీయే అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేపట్టారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా... చలువు పందిళ్లు, అక్కడక్కడా టెంట్లను పునరుద్ధరణ చర్యలు ఊపందుకున్నాయి. దెబ్బతిన్న రోడ్లను జేసీబీలతో త్వరితగతిన బాగుచేసే చర్యలు ముమ్మరమయ్యాయి.

Tags:    

Similar News