Rainfall Alert to Telangana : వచ్చే 3 రోజుల్లో తెలంగాణకు అతి భారీ వర్షాలు
Rainfall Alert to Telangana : 3 రోజుల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది
Heavy Rainfall Alert to Telangana:(File Image)
Rainfall Alert to Telangana: వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావం వల్ల వచ్చే 3 రోజుల్లో తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఆరు ఉమ్మడి జిల్లాలపై రికార్డు స్థాయిలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో కూడా నేడు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు.