Rain Alert: నేటి నుంచి 3 రోజుల పాటు ఉరుములు, వడగళ్లతో కూడిన భారీ వర్ష సూచన

Rain Alert: చాలా రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవబోతున్నాయి. అందులోనూ ఎండాకాలంలో భారీగా ఎండలు పెరుగుతున్న సమయంలో వర్షం కురుస్తుంది.

Update: 2025-03-21 01:24 GMT

Rain Alert

చాలా రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవబోతున్నాయి. అందులోనూ ఎండాకాలంలో భారీగా ఎండలు పెరుగుతున్న సమయంలో వర్షం కురుస్తుంది. ఇవి ఒక్కరోజే వర్షం కురిస్తే వేడి ఎక్కువగా ఉంటుంది. కానీ మూడు రోజులు పాటు వర్షాలు ఉండటం వల్ల కొంత ఉపశమనం పొందవచ్చు. మార్చి 21 నుంచి 23వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. హైదరాబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నేడు కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఇక తెలంగాణలో వరుసగా 4 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇవి వానాకాలంలో వర్షాల వలే కాకుండా అక్కడక్కడ కురుస్తాయి. కానీ ఈ సమయంలో వర్షాలు పడితే రైతులకు పంట నష్టం కలుగుతుంది. ఇప్పుడిప్పుడు వరి కోతకు వస్తున్న సమయం. ఇప్పుడు వర్షాలు పడితే పంట నష్టం తప్పదు.

తెలంగాణలో వచ్చే వర్షాలతోపాటుగా ఈదురుగాలులు, వడగళ్ల వాన పడుతుంది. ఈ వానలు ఇప్పుడు రావడానికి ప్రధాన కారణంగా..ఉత్తరాది మేఘాలు . ఇవి సాధారణంగా చైనా వైపు వెళ్లేవి కానీ ఈసారి చైనా వైపు నుంచి ఉత్తరభారత్ అక్కడి నుంచి ఒడిశా, తెలంగాణ వైపుగా వస్తున్నాయి. ఏపీలో కంటే తెలంగాణలోనే ఎక్కువ వర్షాలు కురువబోతున్నాయని ఐఎండీ తెలిపింది. శనివారం, ఆదివారం, సోమవారానికి సంబంధించి వాతావరణ అధికారులు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు.

ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణలో ఎక్కువగా వానలు కురుస్తాయి. అంటే అసిఫాబాబాద్, నిర్మల్, నిజామాబాద్ కుమురంభీమ్, ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు పడతాయి. ఈ సమయంలో గాలుల వేగం 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక ఏపీలో వర్షాలు తక్కువ ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో కొంత జల్లులు పడే అవకాశం ఉంది. 

Tags:    

Similar News