హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. కర్మన్‌ఘాట్, చంపాపేట్, ఎల్బీనగర్‌లో వర్షం పడుతోంది. అలాగే.. దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, నాగోల్, మలక్‌పేట్, సైదాబాద్, సంతోష్‌నగర్, మియాపూర్‌లోనూ వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ వర్షపు నీటితో మునిగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు.. హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన చేసింది వాతావరణశాఖ. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.