Mahbubnagar: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జోరుగా వర్షం
Mahbubnagar: స్థానిక ఎర్రకుంట చెరువుకు భారీగా చేరిన నీరు
Mahbubnagar: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జోరుగా వర్షం
Mahbubnagar: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.. భారీ వర్షాలకు.. స్థానిక ఎర్రకుంట చెరువుకు భారీగా నీరు చేరింది. చెరువు పూర్తిగా నిండడంతో వరద నీరంతా అడుగు ద్వారా దిగువకు ప్రవహిస్తోంది. దాంతో ఎర్రకుంట దిగువనగల గణేష్ నగర్ ప్రాంతం పూర్తిగా జలమయం అయింది.. దీనికి తోడు రాయచూర్ ప్రధాన రహదారి 165 నంబర్ జాతీయ రహదారి పైకి వరద నీరు చేరింది.. రోడ్డుపై నీటి ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండడంతో మేనక టాకీస్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇక్కట్లకు గురవుతున్నారు.
hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి