అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
Avinash Reddy: రేపు మధ్యాహ్నం విచారణ జరపనున్న తెలంగాణ హైకోర్టు
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
Avinash Reddy: అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్ పిటిషన్‌పై విచారణను రేపటి వాయిదా వేసింది న్యాయస్థానం. రేపు మధ్యాహ్నం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపనుంది.
ఈ రోజు విచారణ సందర్భంగా వాడివేడి వాదనలు జరిగాయి. దస్తగిరి యాంటిసిపెటరీ బెయిల్‌ను సీబీఐ వ్యతిరేకించకపోవడం న్యాయసమ్మతం కాదని అవినాష్ రెడ్డి తరుపు న్యాయవాది వాదించారు. హియర్ అండ్ సే ఎవిడెన్స్‌ను బట్టి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అవినాష్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సీబీఐ దర్యాప్తు సాగుతుందన్నారు.
ఇటు సునీత తరుపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్ర వాదనలు వినిపించారు. అవినాష్‌పై ఎలాంటి కేసులు లేవని అవినాష్ న్యాయవాది చెప్పారని గుర్తు చేశారు. కాని అవినాష్ ఎలక్షన్ అఫిడవిట్‌లో ఆయనపై 4 క్రిమినల్ కేసులున్నాయని వాదించారు. ఇందులో హత్యాయత్నం కూడా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సిట్‌ను అవినాష్ ప్రభావితం చేశారని కోర్టుకు తెలిపారు. ఇంతకు ముందు సాక్ష్యం చెప్పిన సీఐ శంకరయ్యను అవినాష్ ప్రభావితం చేశారని... ఇంటిని క్లీన్ చేసిన మరో మహిళ స్టేట్మెంట్‌ను ఇప్పటికే ప్రభావితం చేశారని -సునీత తరుపు న్యాయవాది సిద్ధార్థ్ లుత్రా వాదనలు వినిపించారు.