కుక్కల దాడి ఘటనపై హైకోర్టులో నేడు విచారణ
* కుక్కల దాడి కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు
కుక్కల దాడి ఘటనపై హైకోర్టులో నేడు విచారణ
High Court: కుక్కల దాడి ఘటనపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. కుక్కల దాడి కేసును హైకోర్టు సుమోలోగా స్వీకరించింది. మూడు రోజుల క్రితం అంబర్‌పేటలో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందాడు. వీధి కుక్కల దాడిలో 4 ఏళ్ల బాలుడు మృత్యువాత పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అంబర్‌పేటకు చెందిన ప్రదీప్ అనే బాలుడు నడుచుకుంటూ వస్తుండగా కుక్కలు చుట్టుముట్టి తీవ్రంగా గాయపరిచి పొట్టనబెట్టుకున్నాయి. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అభం శుభం తెలియని తమ బాలుడు కుక్కల దాడికి బలైపోయాడని ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారింది. ఇక ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన కోర్టు ఇవాళ విచారణ జరపనుంది.