సంగారెడ్డి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన హరీష్ రావు
Harish Rao: మృతులకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలంటూ డిమాండ్
సంగారెడ్డి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన హరీష్ రావు
Harish Rao: చందాపూర్ కెమికల్ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా హత్నర మండలం చందాపూర్ గ్రామ శివారులో గల కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతులకు 50 లక్షలు, క్షత్రగాత్రుకు 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.