Harish Rao: కేంద్ర ప్రభుత్వం తీరుపై మంత్రి హరీష్‌రావు వరుస ట్వీట్లు

Harish Rao: మెడికల్‌ కాలేజీల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది

Update: 2023-03-05 11:35 GMT

Harish Rao: కేంద్ర ప్రభుత్వం తీరుపై మంత్రి హరీష్‌రావు వరుస ట్వీట్లు

Harish Rao: తెలంగాణపై కేంద్రం చూపిస్తున్న వివక్షపై ట్విట్టర్‌లో స్పందించారు మంత్రి హరీష్‌రావు. మెడికల్‌ కాలేజీల విషయంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు మంత్రి హరీష్‌రావు. మెడికల్ కాలేజీల విషయంలో ఒక్కో మంత్రి ఒక్కో విధంగా మాట్లాడటం బాధాకరం అన్నారు. ఒకరు రాష్ట్ర ప్రభుత్వం అడగలేదంటే.. మరొకరు కరీంనగర్, ఖమ్మంలో మెడికల్ కాలేజీలను తెలంగాణ ప్రభుత్వం అడిగిందని.. అక్కడ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉండటం వల్ల మంజూరు చేయలేకపోయామని చెబుతున్నారని గుర్తుచేశారు. కేంద్రం మెడికల్ కాలేజీలు ఇవ్వకున్నా.. పైసా నిధులు మంజూరు చేయకున్నా.. సీఎం కేసీఆర్ సొంత నిధులతో 12 మెడికల్ కాలేజీలను ప్రారంభించారని తెలిపారు. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఉండేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గతంలో బీబీనగర్‌ ఎయిమ్స్‌కి తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించలేదని ఒక కేంద్రమంత్రి నాలుక కరుచుకున్నారని, ఆధారాలు చూపిస్తే నోట మాట లేదని చెప్పారు. ఇప్పుడు నర్సింగ్‌ కాలేజీల విషయంలోనూ అదే వివక్షను ప్రదర్శిస్తున్నారని ట్వీట్‌ చేశారు మంత్రి హరీష్‌రావు.



Tags:    

Similar News