సోమవారం నుంచి పోస్టాఫీస్‌ ద్వారా రూ.1500

లాక్ డౌన్ లో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొకుండా ఉండాలని ప్రభుత్వం ఆరోగ్య భద్రత కార్డు ఉన్న కుటుంబాలకు రూ.1500 ఆర్థికసాయం, మనిషికి 12కిలోల బియ్యాన్ని అందజేస్తుందని ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.

Update: 2020-05-09 14:01 GMT
Minister Harish Rao(File photo)

లాక్ డౌన్ లో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొకుండా ఉండాలని ప్రభుత్వం ఆరోగ్య భద్రత కార్డు ఉన్న కుటుంబాలకు రూ.1500 ఆర్థికసాయం, మనిషికి 12కిలోల బియ్యాన్ని అందజేస్తుందని ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.గత వారమే కొంత మందికి బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం చేసామని ఆయన వెల్లడించారు. బ్యాంకు ఖాతా లేని 5 లక్షల 38 వేల మందికి రూ.1500 రెండవ విడత ఆర్థిక సాయాన్ని పోస్టాఫీసుల ద్వారా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

సోమవారం నుంచి పోస్టాఫీసుల ద్వారా ఈ మొత్తాన్ని అందజేయనున్నట్లు మంత్రి ట్విట్టర్‌ వేధికగా తెలిపారు. ఇందుకు సంబందించిన మొత్తాన్ని ఇప్పటికే ఆర్థిక శాఖ విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో డబ్బులు డ్రా చేసుకునేందుకు అందరూ ఒకే సారి వెళ్ళవద్దని తెలిపారు. ప్రతి ఒక్కరు తప్పని సరిగా బయటికి వెల్లినపుడు భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు.




 



Tags:    

Similar News