Harish Rao: ఏపీ ప్రజలను ఒక్క మాట అనలేదు.. కానీ ఏపీ మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారు
Harish Rao: మీకు చేతనైతే హోదా, విశాఖ ఉక్కుపై పోరాడండి
Harish Rao: ఏపీ ప్రజలను ఒక్క మాట అనలేదు.. కానీ ఏపీ మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారు
Harish Rao: ఏపీ మంత్రుల వ్యాఖ్యలపై... మంత్రి హరీష్‌రావు స్పందించారు. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కుపై మౌనం ఎందుకని ప్రశ్నించానే తప్ప.. ఏపీ ప్రజలను ఒక్క మాట అనలేదన్నారు. కానీ ఏపీ మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారన్నారు. ఏపీ మంత్రులకు చేతనైతే హోదా, విశాఖ ఉక్కుపై పోరాడాలన్నారు. తెలంగాణలో అన్ని పథకాలు బాగున్నాయన్న హరీష్‌రావు... పోలవరం త్వరగా పూర్తి చేసి మీ ప్రజలకు నీళ్లివ్వండన్నారు. తెలంగాణ ఎంతో గొప్పగా ఉందని చెప్పడానికి.. ఇతర రాష్ట్రాలతో పోల్చడం తప్పా అంటూ ప్రశ్నించారు.