Telangana Budget live: తెలంగాణ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన హరీశ్‌రావు

Telangana Budget live: 2022 - 23 ఆర్థిక సంవత్సరం లో 2,56,958.51 కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టిన ప్రభుత్వం.

Update: 2022-03-07 06:51 GMT

తెలంగాణ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన హరీశ్‌రావు

Telangana Budget live: 2022-23 వార్షిక బడ్జెట్‌ను శాస‌న‌స‌భ‌లో ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌వేశ‌పెట్టారు. రూ. 2,56,958.51 కోట్ల‌తో హ‌రీశ్‌రావు బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. రెవెన్యూ వ్య‌యం రూ. 1.89 ల‌క్ష‌ల కోట్లు కాగా, క్యాపిట‌ల్ వ్య‌యం రూ. 29,728 కోట్లు. రాష్ట్రం ఆవిర్భవించిన అన‌తికాలంలో అద్భుత ప్ర‌గ‌తి సాధించామ‌ని హ‌రీశ్‌రావు తెలిపారు. సీఎం ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతూ ప్ర‌గ‌తి ప‌థంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. ప‌రిపాల‌న‌లో రాజీలేని వైఖ‌రిని టీఆర్ఎస్ అవ‌లంభించింది. కరెంట్ కోత‌లు, ఆక‌లి చావులు ఇప్పుడు లేవు అని స్ప‌ష్టం చేశారు.

దళిత బంధుకు రూ.17,700 కోట్లు

11,800 కుటుంబాలకు లబ్ధి

గ్రామ పంచాయతీలకు ప్రతినె రూ. 227.5 కోట్లు

పట్టణ ప్రగతి కోసం రూ.1,394 కోట్లు

మన ఊరు- మన బడి కోసం రూ. 3497 కోట్లు

హరితహారం కోసం రూ.932 కోట్లు

ఆసరా పించన్ల కోసం రూ. 11,728 కోట్లు

కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌కు రూ,2,750 కోట్లు

సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి రూ. 3 లక్షలు

ఈ ఆర్థిక సంవత్సరం 4 లక్షల మందికి..

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం

బీసీ సంక్షేమం కోసం రూ. 5,698 కోట్లు

వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.75వేల లోపు పంట రుణాల మాఫీ

వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు ప్రతిపాదనలు

ఆర్‌ అండ్ బీ కోసం రూ.1,542 కోట్లు

రూ.12,565 కోట్లతో ఎస్టీ సంక్షేమం

రూ.5,698 కోట్లతో బీసీ సంక్షేమం

బ్రాహ్మణ సంక్షేమం కోసం రూ. 177 కోట్ల ప్రతిపాదనలు

Tags:    

Similar News