Harish Rao: రైతుబంధు విషయలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది
Harish Rao: దుబ్బాకలో బీఆర్ఎస్ పార్టీ కృతజ్ఞత సభలో హరీష్ రావు విమర్శలు
Harish Rao: రైతుబంధు విషయలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది
Harish Rao: రైతు బంధు విషయలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని మాజీ మంత్రి హారీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు 15వేలు ఇస్తామని, ఇంత వరకూ ఇవ్వలేదని నిలదీశారు. అధికారంలోకి రాగానే 2వేల పింఛన్‌ను 4వేలకు పెంచుతామన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. కానీ అమలు చేయలేదన్నారు హరీష్ రావు. కాంగ్రెస్, బీజేపీకి కేంద్రంలో అధికారం కోసం తప్ప రాష్ట్రం మీద ప్రేమ ఉండదన్నారు.
దుబ్బాకలో బీఆర్ఎస్ పార్టీ కృతజ్ఞత సభలో పాల్గొన్న హరీష్..కాంగ్రెస్ హమీలపై నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికలలోపు ఇచ్చిన హామీలను నెరవేర్చితేనే..ప్రజలు మిమ్మల్ని నమ్ముతారన్నారు. దుబ్బాకలో ఒక్కో కార్యకర్త ప్రభాకర్‌రెడ్డిలా పని చేసి బీఆర్ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. మోసపూరిత మాటలతో ఒకసారి మోసం చేయగలరు కానీ రెండోసారి మోసం చేయలేరని హరీష్ రావు అన్నారు.