Harish Rao: శ్వేతపత్రంలో వివరాలు మొత్తం తప్పుల తకడగా ఉంది
Harish Rao: ప్రత్యర్థులపై దాడికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది
Harish Rao: శ్వేతపత్రంలో వివరాలు మొత్తం తప్పుల తకడగా ఉంది
Harish Rao: అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక శ్వేతపత్రం చూస్తే రాజకీయ దాడిలా ఉందని విమర్శించారు ఎమ్మెల్యే హరీష్‌రావు. శ్వేతపత్రంలో వివరాలు మొత్తం తప్పులపడకగా ఉందన్నారు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని అన్నారు హరీష్‌రావు. తెలంగాణ ఆర్థికంగా బలపడడానికి గట్టి పునాదులు వేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ తనకు అనుకూలంగా ఈ నివేదికను తయారు చేసుకుందని ఆరోపించారు హరీష్‌రావు. ఆరు గ్యారంటీల నుంచి తప్పించుకునేందుకే నివేదికను తయారు చేశారని ఆరోపించారు.