హన్మకొండ జిల్లా అంబేద్కర్ కాలనీలో ఉద్రిక్తత
Hanamkonda District: డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించాలని ధర్నా
హన్మకొండ జిల్లా అంబేద్కర్ కాలనీలో ఉద్రిక్తత
Hanamkonda District: హన్మకొండ జిల్లా కేంద్రం అంబేద్కర్ కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించాలని ధర్నాకు దిగారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఏళ్లు గడిచినా.. పంపిణీ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇళ్లల్లోకి వెళ్లేందుకు వారు ప్రయత్నించడంతో.. కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని ఆందోళనకారులను అడ్డుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.