Tsrtc Strike : ప్రభుత్వ వాదనలు హైకోర్టును తప్పుదారి పట్టించేలా ఉన్నాయి

రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయిన బీజేపీ నేతలు రాష్ట్రంలో ఏ వర్గం వారు కష్టాల్లో ఉన్నా బీజేపీ అండగా ఉంటోంది- లక్ష్మణ్‌ ప్రభుత్వ వాదనలు హైకోర్టును తప్పుదారి పట్టించేలా ఉన్నాయి- లక్ష్మణ్‌

Update: 2019-10-16 13:26 GMT

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె తీవ్రతను మరోసారి గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ నేతలు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఇంద్రసేనా రెడ్డి, సాంబమూర్తి.. రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితిపై గవర్నర్‌కు నివేదిక అందించారు. హైకోర్టును తప్పుదారి పట్టించేలా ప్రభుత్వ వాదనలున్నాయని, హైకోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లక్ష్మణ్‌ గవర్నర్‌కు వివరించారు. ఆర్టీసీ కార్మికుల ఉసురు ప్రభుత్వానికి తగులుతోందని, ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి కార్మికులతో చర్చలు జరపాలని లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News