Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ‌్యలు
Raja Singh: పోలీసులను ఎంఐఎం ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారు
Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ‌్యలు
Raja Singh: హైదరాబాద్ గడ్డ మర్డర్లకు అడ్డాగా మారిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఓల్డ్ సిటీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా చనిపోయిందని.. అందుకే మర్డర్లు.. దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. లా అండ్ ఆర్డర్ పరిరక్షించే పోలీసులపైనే ఎంఐఎం ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తూ.. బెదిరిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. షాపులు అర్ధరాత్రి, 2, 3 గంటల వరకూ తెరిచే ఉంటున్నాయని.. వాటిని మూసేస్తే.. ఎంఐఎంకు ఏం బాధ వచ్చిందని రాజాసింగ్ ప్రశ్నించారు. చంపేది.. చనిపోయేది.. అతని వర్గం వాళ్లే.. కదా.. అది అసదుద్దీన్‌కు కనిపించడం లేదా..? అని నిలదీశారు. లా అండ్ ఆర్డర్‌ను కంట్రోల్ చేయడానికి పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వాలని.. పోలీసులు కూడా.. సీఎం ఆదేశాలు ఫాలో కావాలి కానీ.. అసదుద్దీన్ ఆదేశాలు కాదని.. రాజాసింగ్ పేర్కొన్నారు.