పాస్‌పోర్టు దారులకు శుభవార్త.. గడువు ముగియకముందే మొబైల్‌కు సందేశం..

చాలా మంది వారి దగ్గరున్న వాహనాలకు సంబంధించిన ధృవపత్రాలు కానీ, ఇన్సురెన్సులను, కానీ మరి ఏ ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను కానీ రెన్యువల్ చేయించడం మరిచిపోతుంటారు.

Update: 2020-02-17 07:52 GMT

చాలా మంది వారి దగ్గరున్న వాహనాలకు సంబంధించిన ధృవపత్రాలు కానీ, ఇన్సురెన్సులను, కానీ మరి ఏ ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను కానీ రెన్యువల్ చేయించడం మరిచిపోతుంటారు. ప్రస్తుతం ఉన్న బిజీ కాలంలో చేపిద్దాంలే అనుకుంటూ నెగ్లెట్ చేస్తారు. తీరా సమయం వచ్చినాక అయ్యో మర్చిపోయామా, ఎవరైనా గుర్తు చేస్తే బాగుండునని అనుకుంటుంటారు.

అదే విధంగా పాస్‌పోర్టు తీసుకుని రెన్యూవల్‌ చేయడం మరిచిపోతారు. తీరా సందర్భం వచ్చినాక వ్యాలిడిటీ లేదని బాధపడుతుంటారు. అలాంటి వారి కోసం పాస్ పోర్టు అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు. పాస్ పోర్టు కార్యలయంవారు గడువు ముగియకముందే పాస్ పోర్టు దారుడికి మీ గడువు ఫలానా తేదీతో ముగుస్తుందని సమాచారం చేరవేస్తుంది. గడువు ముగిసే తేదీకీ 9 నెలల ముందు ఒకసారి, 7 నెలల ముందు మరోసారి సమాచారం అందిస్తుంది. ఈ సమాచారాన్ని పాసుపోర్టుదారుడి రిజిస్టర్‌ మొబైల్‌కు ఎస్ఎంఎస్ ద్వారా ఇస్తుంది.

అంతే కాదు దాన్ని వెంటనే రెన్యూవల్‌ చేసుకోవాలని, దానికోసం దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తుంది. ఈ నిర్ణయాన్నికూడా ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది బాధపడుతున్నారని వ్యవహారాల శాఖ తీసుకుంది. అంతే కాక ఫేక్‌ వెబ్‌సైట్‌ల బారినపడి డాటా చౌర్యం కాకుండా సంబంధిత పాస్‌పోర్టు దారుడికి పంపే సందేశంలో పాస్‌పోర్టు దరఖాస్తు చేసుకునేందుకు www.passportindia.gov.in వెబ్‌సైట్‌ లింకును కూడా తెలియచేస్తుంది. దీంతోపాటు గానే mPassport సేవా యాప్‌ కూడా దరఖాస్తు దారుల కోసం తీసుకొచ్చింది, దీని ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దీంతో పాస్ పోర్టును రెన్యువల్ చేయడం ఎంతో సులభంగా మారింది.

Tags:    

Similar News