Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్.. సిమెంట్, స్టీల్ ధరల తగ్గింపుపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

Indiramma Housing Scheme: రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సిమెంట్‌, స్టీల్‌ను తక్కువ ధరకు అందించనుంది.

Update: 2025-07-19 06:12 GMT

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్.. సిమెంట్, స్టీల్ ధరల తగ్గింపుపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

Indiramma Housing Scheme: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో మరో పెద్ద అడుగు పడింది. స్వంత స్థలం ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంటి నిర్మాణాన్ని మొదలుపెట్టలేకపోతున్న పేదలకు ఇది నిజమైన గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సిమెంట్‌, స్టీల్‌ను తక్కువ ధరకు అందించనుంది.

ఇటీవలి కాలంలో నిర్మాణ సామగ్రి ధరలు అమాంతం పెరిగిపోయిన నేపథ్యంలో, పేదలకు ఆర్థిక భారం ఎక్కువవుతోంది. ముఖ్యంగా సిమెంట్‌, స్టీల్‌ ధరలు గణనీయంగా పెరగడంతో, కేంద్రంగా ఊహించిన ఖర్చు మించి వెచ్చించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీనికి పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటు

ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వం ప్రత్యేకంగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఈ కమిటీ పని చేయనుంది. అదే విధంగా జిల్లాల స్థాయిలో కలెక్టర్లు కమిటీ చైర్మన్‌లుగా వ్యవహరిస్తారు. ఈ కమిటీల కీలక భాధ్యత ఏమిటంటే, సిమెంట్‌, స్టీల్‌ వంటి నిర్మాణ పదార్థాలకు నిర్దిష్ట ధరలను నిర్ణయించి, అదే ధరకు లబ్ధిదారులకు సరఫరా అయ్యేలా చూడటం.

మధ్యవర్తుల దోపిడీకి చెక్

ప్రభుత్వం ఈ చర్యలతో మధ్యవర్తుల దోపిడీకి చెక్ వేసే ప్రయత్నం చేస్తోంది. వాస్తవ ధరల కంటే అధికంగా వసూలు చేసే వాణిజ్య సంస్థల వల్ల పేదలు ఇంతవరకూ నష్టపోతున్నారు. ఇకపై లబ్ధిదారులు అధిక ధరలు చెల్లించాల్సిన అవసరం లేకుండా, ప్రభుత్వ సాయంతో తక్కువ ధరలకు కట్టుబడి ఉన్న నిర్మాణ సామగ్రిని పొందే అవకాశముంది.

ఇసుక ఉచితం - స్టీల్‌, సిమెంట్‌ తక్కువ ధరకు

ఇసుక ఇప్పటికే ఉచితంగా లభిస్తున్న ఈ పథకంలో, ఇప్పుడు స్టీల్‌, సిమెంట్‌ను కూడా తక్కువ ధరకే ఇవ్వడం వల్ల లబ్ధిదారులపై ఆర్థిక భారం తగ్గనుంది. ఈ పరిణామంతో పథకం మరింత వేగవంతమవుతుందని అధికారులు చెబుతున్నారు.

పథకం వేగవంతం అవుతుందా?

ఇప్పటికే మొదటి విడతగా పలు జిల్లాల్లో లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. తాజా చర్యలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మరింత వేగంగా సాగే అవకాశం కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర గృహనిర్మాణ లక్ష్యాలను సమర్థవంతంగా చేరుకునేలా దోహదపడుతుందని అంచనా.

Tags:    

Similar News