Gaddar: కొనసాగుతోన్న ప్రజా గాయకుడు గద్దర్ అంతిమయాత్ర

Gaddar: గన్‌పార్క్‌, అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్‌బండ్ మీదుగా అల్వాల్ వరకు అంతిమయాత్ర

Update: 2023-08-07 08:35 GMT

Gaddar: కొనసాగుతోన్న ప్రజా గాయకుడు గద్దర్ అంతిమయాత్ర

Gaddar: ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ అంతిమయాత్ర కొనసాగుతోంది. ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభమైన యాత్ర.. గన్ పార్క్, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం, ట్యాంక్ బండ్, జేబీఎస్, తిరుమలగిరి మీదుగా అల్వాల్ లోని ఆయన నివాసం వరకు కొనసాగనుంది. వేలాది మంది అభిమానులు పార్థివదేహాన్ని అనుసరిస్తుండగా ఆయన అంతిమయాత్ర సాగుతోంది. ప్రజాగాయకుడు గద్దర్‌ను కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, కళాకారులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.

గద్దర్‌ భౌతికకాయాన్ని చూసి పలువురు కన్నీటిపర్యంతమయ్యారు. జోహార్ గద్దర్ అంటూ అభిమానులు, సన్నిహితులు, అనుచరులు నినదిస్తున్నారు. తన నివాసంలో గద్దర్ పార్థివ దేహాన్ని కాసేపు ఉంచుతారు. ఇక్కడే ముఖ్యమంత్రి కేసీఆర్.. గద్దర్‌కు నివాళి అర్పిస్తారు. గద్దర్ అంతిమయాత్రలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులతో పాటు, ఆయన అభిమానులు, కళాకారులు భారీగా పాల్గొని.. కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. అనంతరం అల్వాల్‌లో గద్దర్‌ ఏర్పాటు చేసిన బోధి విద్యాలయంలో గద్దర్‌ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతాయి. ఇప్పటికే అల్వాల్ భూదేవి నగర్‌లోని మహాభోది విద్యాలయంలో గద్దర్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News