ఆపరేషన్ సిందూర్ నుంచి ఆర్సీబీ తొలి ట్రోఫీ వరకు.. మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్న వినాయక విగ్రహాలు!
పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పండుగ వినాయక చవితి. ఆగస్ట్ రెండో వారంనుంచే దేశమంతా గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందడి మొదలవుతుంది. ఈ సందర్భంలో విగ్రహ తయారీదారులు కొత్త తరహా వినాయక విగ్రహాలను రూపొందించి భక్తులను ఆకర్షిస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్ నుంచి ఆర్సీబీ తొలి ట్రోఫీ వరకు.. మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్న వినాయక విగ్రహాలు!
పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పండుగ వినాయక చవితి. ఆగస్ట్ రెండో వారంనుంచే దేశమంతా గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందడి మొదలవుతుంది. ఈ సందర్భంలో విగ్రహ తయారీదారులు కొత్త తరహా వినాయక విగ్రహాలను రూపొందించి భక్తులను ఆకర్షిస్తున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ట్రెండ్‌కు తగ్గట్టుగా ప్రత్యేకమైన వినాయక విగ్రహాలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి.
2025లో జరిగిన సంఘటనలకు ప్రతిరూపంగా కొన్ని విగ్రహాలు రూపొందించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. తాజాగా బెంగళూరు రూరల్ జిల్లా దేవనహళ్లి తాలూకాలోని విజయపురకు చెందిన రాజగోపాల్, ఆర్సీబీ జట్టు తొలి ఐపీఎల్ ట్రోఫీ గెలుపు జ్ఞాపకార్థం, గణేశుడు చేతిలో RCB కప్పు పట్టుకున్న విగ్రహాన్ని తయారు చేశారు. ప్రస్తుతం ఈ విగ్రహం ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అదే విధంగా ఆపరేషన్ సిందూర్‌ను ప్రతిబింబించేలా కూడా వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. సైనికుడి రూపంలో వినాయక విగ్రహాన్ని రూపొందించి, దాని ముందర మిలటరీ వాహనం, ఎస్-400 క్షిపణి ఏర్పాటు చేసినట్లు కొన్ని విగ్రహాలు కనిపిస్తున్నాయి. భారత్ చేపట్టిన ఆ సైనిక చర్యను గుర్తుచేస్తూ వీటిని రూపొందించినట్టు చెబుతున్నారు.
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వినాయక విగ్రహాల కొనుగోళ్లు జోరందుకున్నాయి. ముఖ్యంగా ధూల్‌పేటలో తయారైన విగ్రహాలు పెద్ద మొత్తంలో ఇతర ప్రాంతాలకు పంపబడుతున్నాయి. ఈ సారి పర్యావరణ అనుకూల మట్టి విగ్రహాలకు ప్రజలు అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో, వాటి విక్రయాలు మరింతగా పెరిగాయి.