ఒకే ఫ్యామిలీ నుంచి నలుగురికి పోలీసు ఉద్యోగాలు..

Update: 2019-07-18 03:29 GMT

కష్టపడితే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించారు ఆ అన్నదమ్ములు. పేదరికాన్ని జయించాలంటే చదువొక్కటే మార్గమని నమ్మి సోమరితనం తమ దరిదాపుల్లోకి రాకుండా పారదోలిన అన్నదమ్ముల విజయగాథ ఇది. తాను నడిచిన ముళ్లదారిని కొడుకులకు పూలబాటగా మార్చడంతో ఒక్కరు కాదు ఇద్దరు కారు ఏకంగా నలుగురు ప్రభుత్వాద్యోగాలను సాధించారు. విజయకేతనం ఎగరవేసిన ఆ నలుగురు ఎవరో తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్‌ కావాల్సిందే.

ఒకే ఫ్యామిలీ నుంచి నలుగురు పోలీసులు కష్టపడి చదివి పోలీసులుగా మారిన అన్నాదమ్ముళ్లు..యువతకు ఆదర్శంగా నిలుస్తోన్న పోలీస్ బ్రదర్స్‌. కష్టపడితే ఏదైనా సాధ్యమవుతుందని నిరూపించారు ఇక్కడ కనిపిస్తోన్నపోలీసులు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎన్టీఆర్ నగర్‌లో నివస్తున్న ఈ కుటుంబంలో అందరు ప్రభుత్వ ఉద్యోగాల్లో సెటిల్‌ అయ్యారు. ఐదుగురు అన్నదమ్ముల్లో ముగ్గురు ఎస్ఐ‌లుగా ఎంపికకాగా మరో సోదరుడు కానిస్టేబుల్‌గా ఎంపిక కయ్యాడు. ఇంకో సోదరుడు సింగరేణి 2ఏ బొగ్గుగనిలో ఉద్యోగాన్ని కొట్టేశాడు. ఇలా ఒకే కుటుంబం నుంచి నలుగురు పోలీసులు కాగా వారిలో ముగ్గురు సోదరులు ఎస్.ఐలుగా ఎంపిక కావడం చాలా అరుదైన విషయం.

గోపతి శoకరయ్య, భాగ్యలక్ష్మి అనే దంపతుల సొంత ఊరు తిర్యాని మండలం గోయుగం. వీరికి ఐదుగురు కొడుకులు. తన రెక్కలు ముక్కలు చేసుకొని ఎంతో శ్రమించి తమకున్న ఐదుగురు కొడుకులను గొప్ప చదువులు చదివించాడు. 2వ కొడుకు వెంకటేష్ ఆర్మీలో ఉద్యోగం సంపాదించి కొన్నిరోజులు చేసి ఆ జాబ్ రిజైన్ చేశాడు. ఆ తర్వాత సివిల్స్‌కు ప్రిపేర్ అయి 2011లో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించారు. ప్రస్తుతం గోదావరిఖని 1టౌన్ లో విధులు నిర్వహిస్తున్నారు.

అదే సంవత్సరంలో తన పెద్దన్నయ్య రవీందర్ కానిస్టేబుల్ సంపాదించి ఆ జాబ్‌కి రిజైన్ చేసి ఎస్ఐకి ప్రిపేరై 2012లో ఎస్ఐగా ఉద్యోగం సంపాదించాడు. ప్రస్తుతం జాగిత్యాలో ఎస్.బి. ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. తండ్రి పేషేంట్ అయినందున 3వ కొడుకు సంతోష్ తన సింగరేణి ఉద్యోగం పెట్టించాడు. తర్వాత కొన్ని నెలల్లోనే తండ్రి చనిపోయాడు. ఇక మిగిలిన ఇద్దరు కొడుకులైన సురేష్, నరేష్ 2017లో టిఎస్ఎస్ కానిస్టేబుల్స్‌గా ఉద్యోగం సంపాదించి ఆ జాబ్‌కి రిజైన్ చేసి సివిల్‌కి ప్రిపేర్ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా వెలువడిన ఎస్.ఐ ఫలితాల్లో వీరిద్దరూ ఎస్.ఐ ఉద్యోగానికి ఎంపికయ్యారు.

జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా తన పిల్లలని చాలా కష్టపడి చదివించి ప్రయోజకులను చేసినందుకు తల్లి భాగ్యలక్ష్మి ఎంతో ఆనందం వ్యక్తం చేసారు. ఈ సమయములో మా నాన్న గారు బ్రతికిఉంటే ఉంటే చాలా సంతోషించేవారని కొడుకులు చెప్పుకొచ్చారు. ఒకే ఇంట్లో అందరూ గవర్నమెంట్‌ ఉద్యోగాలు పొందడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒకే ఇంట్లో ప్రభుత్వ కొలువులు సాధించి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని కోనియాడుతున్నారు.  

Full View

Tags:    

Similar News