గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో ఫుడ్ ఫాయిజన్

Update: 2019-11-24 05:12 GMT
ప్రతీకాత్మక చిత్రం

నిజామాబాద్ నగర శివారులోని నాగారం గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో ఫుడ్ ఫాయిజన్ జరిగింది. రాత్రి భోజనం అనంతరం విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డ విద్యార్ధులను గిరిజన కళాశాల సిబ్బంది సమీప ఆస్పత్రికి తరలించారు. సుమారు 63 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.

నాగారం గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్వస్థతతో చికిత్స పొందుతున్న విద్యార్థినిలను కలెక్టర్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యలుకు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.



Tags:    

Similar News