New Ration Card: రేషన్ కార్డు స్టేటస్ గురించి ఇలా తెలుసుకోవచ్చు..!
New Ration Card: కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేశారా? అయితే మీ దరఖాస్తు స్టేటస్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
New Ration Card: కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేశారా? అయితే మీ దరఖాస్తు స్టేటస్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించింది. 2025 జనవరి 26 నుంచి రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. లబ్దిదారుల ఎంపిక కోసం గ్రామ సభలను నిర్వహించింది. ఆన్ లైన్ లో కూడా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించింది.
https://epds.telangana.gov.in/FoodSecurityAct/ ద్వారా రేషన్ కార్డు దరఖాస్తును ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో ఎడమవైపు కనిపించే ఆఫ్షన్లలో ఎప్‌ఎస్‌సీ సెర్చ్ క్లిక్ చేయాలి. రేషన్ కార్డు సెర్చ్ అనే ఆఫ్షన్ కన్పిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే స్టేటస్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ కార్డు సెర్చ్ ఆఫ్షన్లు కనిపిస్తాయి. ఎఫ్ఎస్‌సీ అప్లికేషన్ సెర్చ్ మీద క్లిక్ చేయాలి. జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికేషన్ నెంబర్ బాక్సులో మీ ధరఖాస్తు నెంబర్ ను ఎంటర్ చేసి సెర్చ్ బటన్ ను క్లిక్ చేయాలి. అప్పుడు మీ అప్లికేషన్ కు సంబంధించి వివరాలు తెలుస్తాయి. ఒకవేళ రేషన్ కార్డు రిజెక్ట్ అయితే ఆ ఆఫ్షన్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అయిందో తెలుస్తుంది.