శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పొగమంచు.. పలు విమానాలు రద్దు
Shamshabad: ఆదివారం 14,సోమవారం 15, మంగళవారం 8 సర్వీసులు రద్దు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పొగమంచు.. పలు విమానాలు రద్దు
Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పొగమంచు కారణంగా పలు విమానాలు రద్దు అవుతున్నాయి. మూడు రోజులుగా విమానాశ్రయంలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మూడు రోజుల్లో 37 విమానాలు రద్దు చేశారు అధికారులు. ఆదివారం 14,సోమవారం 15, మంగళవారం 8 సర్వీసులు రద్దు అవగా.. విమాన సర్వీసుల రద్దుతో ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు.