Telangana: తెలంగాణలో నాల్గో రోజుకు చేరిన ఫీవర్ సర్వే

Telangana: మూడు రోజుల్లో 42.30 లక్షల ఇళ్లల్లో సర్వే

Update: 2022-01-24 04:23 GMT

 తెలంగాణలో నాల్గో రోజుకు చేరిన ఫీవర్ సర్వే 

Telangana: తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ అలెర్ట్ అయింది. మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. మంత్రి హరీష్ రావు ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ఫీవర్ సర్వే చేపట్టారు. జనవరి 21 నుంచి ప్రారంభమైన ఫీవర్ సర్వే నాల్గవ రోజుకు చేరుకుంది. అన్ని జిల్లాల్లోని వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం ,దగ్గు లక్షణాలున్న వారికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారికి హోమ్ ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికి ఆరోగ్యం పేరుతో శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా ఫీవర్ సర్వే ప్రారంభమైంది. ఫీవర్ సర్వే‌పై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.

మూడురోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 42.30లక్షల ఇళ్లల్లో ఫీవర్ సర్వే నిర్వహించారు. ఇప్పటి వరకు 1లక్షా 78వేల హోం ఐసోలేషన్ కిట్లు అందజేసినట్లు వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది.ఇంటింటి ఫీవర్ సర్వేలో చిన్నారులు, పెద్దవారిని వేర్వేరుగా వివరాలు సేకరిస్తున్నారు. ఎక్కువ శాతం పెద్ద వయస్సు వారిలోనే కరోనా లక్షణాలు గుర్తించారు. కరోనా నిర్ధారణ అయిన వారిని స్థానిక వైద్యాధికారుల పర్యవేక్షణలో ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇప్పటి వరకు టెస్టింగ్ సెంటర్ల వద్ద భారీ క్యూలు కనిపించేవి. ప్రస్తుతం ఇంటింటికి ఆరోగ్యశాఖ సిబ్బంది వెళ్లడంతో టెస్టింగ్ సెంటర్స్ వద్ద రద్దీ తగ్గుతోంది. 

Tags:    

Similar News