Vikarabad: వికారాబాద్ జిల్లాలో రైతుల ఆందోళన

Vikarabad: ధాన్యం కొనుగోళ్లు జరపడం లేదని ఆగ్రహం * తాండూరు-హైదరాబాద్ రహదారిపై బైఠాయించిన రైతులు

Update: 2021-05-30 07:16 GMT

వికారాబాద్ రైతుల ఆందోళన (ఫైల్ ఇమేజ్)

Vikarabad: వికారాబాద్ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. పెద్దేముల్ మండలం మంబాపూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వరి కొనుగోళ్లు జరపడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని.. గోనెసంచులు సైతం పంపిణీ చేయడం లేదంటూ అన్నదాతలు ఆరోపించారు. తాండూర్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. గోనో సంచులు అందించాలని అధికారులకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఫోన్ ద్వారా తెలిపిన కూడా పట్టించుకోవడంలేద్నారు. లాక్ డౌన్ విరామ సమయం లో రైతన్నలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేయడం తో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జాం అయింది. రెండు గంటలకు పైగా ఆందోళన కొనసాగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు..

Tags:    

Similar News