Nizamabad: నిజామాబాద్ మద్నూర్ మార్కెట్ యార్డ్ ముందు రైతుల ధర్నా
Nizamabad: కొనుగోలు చేసిన శనగలను తిప్పి పంపిన అధికారులు
Nizamabad: నిజామాబాద్ మద్నూర్ మార్కెట్ యార్డ్ ముందు రైతుల ధర్నా
Nizamabad: నిజామాబాద్ జిల్లా మద్నూర్ మండల మార్కెట్ యార్డు ముందు రైతులు ధర్నా చేపట్టారు. శనగల కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేసిన శనగలు నాణ్యతగా లేవని అధికారులు వాటిని తిప్పి పంపారు. దీంతో రైతులు ధర్నా నిర్వహించారు. సహకార సంఘంలో ఉన్నఅధికారులు డబ్బుల కోసం ఆశపడి శనగలను తిప్పి పంపుతున్నానని రైతులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న సహకార సంఘం ఛైర్మన్ ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తానని హామినిచ్చారు.