తెలంగాణలో ప్రసిద్ధ క్రైస్తవ ప్రార్థన మందిరాలు

Update: 2019-12-24 15:36 GMT
christmas church

క్రిస్మస్ పండుగ వస్తుందంటే చాలు ప్రతి క్రైస్తవుల ఇంట నెల రోజలు ముందు నుంచే సందడి మొదలవుతోంది. భారత దేశంలో ప్రతి ఒక్కరూ మతాలకు అతీతంగా ఈ క్రిస్మస్ వేడుకలో పాలుపంచుకుంటారు. క్రిస్మస్ రోజున చర్చిల్లో ప్రార్థనలు మిన్నంటుతాయి. బాల యేసు పశువుల పాకలో పుట్టడం ఓ విశేషం అయితే. అలాంటి రోజును క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో కిస్మస్‌ జరుపుకుంటారు. క్రిస్టియన్లకు ఇదే పెద్ద పండుగ. కులమత బేధాలకు తావులేకుండా ఎంతో ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలి. 24వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 25వ తేదీ ఉదయం వరకూ ప్రార్థనలు జరుపుకుంటారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రార్థనా మందిరాల గురించి ప్రత్యేక కథనం..

మెదక్‌

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది ఆసియాలో రెండో అతిపెద్ద మెదక్‌ క్యాథడ్రల్‌ చర్చ్‌లో క్రిస్మస్‌ వేడుకలు ప్రతి ఏటా ఎంతో ఘనంగా జరుగుతాయి. కుల మతాలకు అతీతంగా అందరూ ఇక్కడ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.




పాల్వంచ

పాల్వంచ పట్టణంలోని ఉన్న లివింగ్‌ గాస్పెల్‌ చర్చ్‌ ఇండిపెండెంట్‌ చర్చిల్లోనే పెద్దదిగా గుర్తింపు చెందింది. 1984లో సింగరేణి సంస్థలో ఉద్యోగాన్ని వదిలి పాస్టర్‌ లిటిల్‌ దేవసహాయంతో కొందరు భక్తులతో లివింగ్‌ గాస్పెల్‌ చర్చిని బాపూజీ నగర్‌లో ప్రారంభించారు. వేలాది మంది భక్తులు ఆ చర్చికి వస్తుంటారు. ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వేలాదిమంది వస్తుంటారు.




కొత్తగూడెం

రాష్ట్రంలోనే రెండో పెద్ద చర్చిగా కొత్తగూడెం పట్టణంలోని సెయింట్‌ ఆండ్రూస్‌ సీఎస్‌ఐ చర్చి గుర్తింపు పొందింది. కొత్తగూడెంలో1943లో బ్రిటిష్‌ కాలంలో 15 కుటుంబాల పోస్టాఫీస్‌ సెంటర్‌లో నిర్మించారు. ఒకేసారి మూడువేల మంది ప్రార్థనలు చేసేలా దీనిని నిర్మించారు. ప్రతి ఆదివారం ఈ చర్చికి వచ్చే భక్తులతో కళకళాడుతుంది.



ఖమ్మంరూరల్‌:

కరుణగిరి చర్చి ఖమ్మంలోని నాయుడపేట నుంచి మొదలై అటు బైపాస్‌ రోడ్డు వరకూ ఆనుకుని ఉన్న ఎంతో ప్రఖ్యాతిగాంచింది. 20 ఏళ్లుగా క్రైస్తవులు విశేష ప్రార్థనలు చేస్తున్నారు.




తల్లాడ:

లూర్థుమాత ఆలయం రాష్ట్ర రహదారి పక్కనే తల్లాడలో ఉన్న చర్చి జిల్లాలోనే అతి పెద్దది. రోమన్‌ కేథలిక్‌ మిషన్‌ ఆధ్వర్యంలో 21 సంవత్సరాల క్రితం నిర్మించారు. చుట్టూ కల్వరి కొండలు, ఏసుక్రీస్తు జీవితానికి సంబంధించిన విశేషాలు, చర్చిగోపురంమే 150 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆలయం గంట శబ్ధం చూట్టూ కిలో మిటర్ పైనే వినిపిస్తుంది. 




 




Tags:    

Similar News